ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- July 24, 2026
మనామా: బహ్రెయిన్‌లోని ప్రముఖ సంప్రదాయ మార్కెట్ ముహర్రక్ సూక్ వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గతంలో మార్కెట్ అందాన్ని మెరుగుపరచే ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన కాంక్రీట్ పూల తోటలను తొలగించి, వాటి స్థానంలో మళ్లీ వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు.
ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్, స్థానిక వ్యాపారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం వర్క్స్ మినిస్ట్రీ షేక్ హమద్ అవెన్యూలో పార్కింగ్ స్థలాల విస్తరణ, మార్పులు చేపట్టిందని కౌన్సిల్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అల్ నార్ తెలిపారు.
2022లో ఆమోదం పొందిన పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టును బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ ఆంటిక్విటీస్ అమలు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పార్కింగ్ స్థలాలను తొలగించి పూల తోటలను ఏర్పాటు చేశారు. దీంతో మార్కెట్ అందంగా మారినప్పటికీ, పార్కింగ్ కొరత కారణంగా వినియోగదారులు తగ్గి వ్యాపారాలపై ప్రభావం పడిందని దుకాణదారులు ఫిర్యాదు చేశారు.
తాజా నిర్ణయం ప్రకారం సూక్ ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో 108 నుంచి 120 పార్కింగ్ స్థలాలు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా షేక్ హమద్ అవెన్యూలో మరో 83 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయనున్నారు.
అలాగే పాత ముహర్రక్ పోస్టాఫీస్ స్థలంలో మల్టీ ఫ్లోర్ కార్ పార్కింగ్ భవనం నిర్మాణం కొనసాగుతోంది. ఇది పూర్తయితే పార్కింగ్ సమస్యకు మరింత ఉపశమనం లభించనుంది.
వ్యాపారులు, వినియోగదారులు, పార్లమెంట్ సభ్యులు పార్కింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని చేసిన పలు విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







