'సౌండ్ ఇంజినీర్'-ఆకట్టుకునే ఫస్ట్ లుక్ రిలీజ్
- July 26, 2026
హీరో రోహిత్ నారా 23వ చిత్రం కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ LLP నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందిస్తున్నారు.
రోహిత్ నారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'సౌండ్ ఇంజనీర్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. స్పీకర్లా కనిపించే హార్ట్ సింబల్ 'O' అక్షరంతో కూడిన క్రియేటివ్ డిజైన్ టైటిల్ లోగో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చేతితో రాసిన నోట్స్, ధ్వని తరంగాలు, విచిత్రమైన డూడుల్స్‌తో కూడిన ఈ డిజైన్, హీరో ఇంట్రస్టింగ్ వరల్డ్ ని పరిచయం చేస్తుంది.
ఫస్ట్-లుక్ పోస్టర్ రోహిత్ నారాను సరికొత్త అవతారంలో పరిచయం చేస్తుంది. తెల్లటి కుర్తా, పైజామా ధరించి, అతను ఒక టెర్రస్ అంచున కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కనిపించారు. కూల్ పాస్టెల్ రంగులతో కలిసి, పోస్టర్‌కు ఆహ్లాదకరమైన ఫీలింగ్ ని అందిస్తోంది.
టైటిల్ తో పాటు, కథానాయకుడి ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. హాస్యనటుడు సుదర్శన్ వాయిస్ తో ఈ వీడియో, రోహిత్ నారా పాత్రకు వినికిడి లోపం ఉందని తెలివిగా సూచిస్తూ, అతనికి "సౌండ్ ఇంజినీర్" అనే ట్యాగ్ తెచ్చిపెట్టింది.
టైటిల్, కాన్సెప్ట్ వీడియో ప్రేమ, హాస్యం, భావోద్వేగాలు, సంగీతాన్ని మిళితం చేసే కథను సూచిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించడంలో సక్సెస్ అయ్యింది.
రోహిత్ నారా సరసన నయన్ సరిక కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో నరేష్ వికె, రోహిణి, సంపత్, అజయ్లతో సహా పలువురు ప్రముఖ సహాయ నటీనటులు కీలక పాత్రలలో నటించారు. వినోదాన్ని మరింత పెంచుతూ, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి తమ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచనున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, వెంకట్ సి. దిలీప్ డీవోపీ, సుప్రియా బట్టేపాటి ప్రొడక్షన్ డిజైనర్.
నటీనటులు: రోహిత్ నారా, నయన్ సారిక, నరేష్ వికె, రోహిణి, సంపత్, అజయ్, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి తదితరులు.
ప్రొడక్షన్ బ్యానర్: కరణ్ సి ప్రొడక్షన్స్ LLP
నిర్మాత: భరత్ చౌదరి చెరుకూరి
సమర్పణ: శ్రీలత చెరుకూరి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చినిమిల్లి మణికుమార్
DOP: వెంకట్ సి దిలీప్
ప్రొడక్షన్ డిజైనర్: సుప్రియ బట్టెపాటి
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







