నాని 'ది ప్యారడైజ్' 'ఆయా షేర్' అరుదైన రికార్డ్..
- July 26, 2026
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' విడుదలకు ముందే తన మ్యూజిక్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట 'ఆయా షేర్' ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దాటుతూ ఈ ఏడాది అతిపెద్ద చార్ట్‌బస్టర్ పాటల్లో ఒకటిగా నిలిచింది.
విడుదలైనప్పటి నుంచి 'ఆయా షేర్' సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా కొనసాగుతోంది. సోషల్ మీడియా యూజర్స్, కాలేజ్ స్టూడెంట్స్, చిన్నారులు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ పాట ఆకట్టుకుంది. క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ కోరియోగ్రఫీ, పవర్‌ఫుల్ విజువల్స్‌తో ఈ పాట సెలబ్రేషన్స్, పబ్లిక్ ఈవెంట్స్‌లో తప్పనిసరిగా వినిపించే సాంగ్‌గా మారింది.
అనిరుధ్ రవిచందర్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్‌కు కాసర్ల శ్యామ్ రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ ఎనర్జిటిక్ వోకల్స్ ఈ పాటను మరింత వైరల్ అయ్యేలా చేశాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో నానిని మరోసారి పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించారు. నాని ఫియర్స్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ మేకోవర్, హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులతో పాటు సినీ అభిమానుల ప్రశంసలు అందుకుంటూ ఈ పాటను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిపాయి.
'ఆయా షేర్' ఇప్పటికే రికార్డులను తిరగరాస్తుండటంతో 'ది ప్యారడైజ్' 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇదే సమయంలో ఈ ఆల్బమ్ నుంచి రానున్న నెక్స్ట్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







