సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- July 27, 2026
రియాద్: గాయాలకు ఉపయోగించే డ్రెస్సింగ్‌లు, వౌండ్ కంప్రెస్లకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) సాంకేతిక కమిటీ ISO/TC 357కు సౌదీ అరేబియా నేతృత్వం వహించనుంది. ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్న మిడిలీస్టులోని తొలి దేశంగా సౌదీ నిలిచింది. ఈ ఘనత సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA), సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ అండ్ క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) సంయుక్త కృషి ఫలితంగా సాధ్యమైందని అధికారులు తెలిపారు.
ఈ కమిటీకి సెక్రటేరియట్‌గా SFDA వ్యవహరించనుండగా, గాయాల డ్రెస్సింగ్‌లు, వౌండ్ కంప్రెస్లకు సంబంధించిన భద్రతా ప్రమాణాలు, పనితీరు ప్రమాణాలు, పరీక్షా విధానాలు, నాణ్యత నియంత్రణ వంటి అంశాలపై అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పనకు సాంకేతికంగా నాయకత్వం వహించనుంది. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా యూనిఫైడ్ ప్రమాణాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని SFDA ఈ కమిటీ ఏర్పాటును ప్రతిపాదించగా, ISOతో పాటు వివిధ దేశాల ప్రమాణాల సంస్థలతో సాంకేతిక, పరిపాలనా సమన్వయాన్ని SASO నిర్వహించింది.
ISO సాంకేతిక కమిటీలు, టెక్నికల్ మేనేజ్మెంట్ బోర్డు (ISO/TMB) పరిశీలన అనంతరం సౌదీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కమిటీ ఏర్పాటుకు 27 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, 13 దేశాలు పాల్గొనే సభ్యులుగా, 21 దేశాలు పరిశీలక సభ్యులుగా చేరాయి. ఈ విజయంతో అంతర్జాతీయ ప్రమాణాలు, నాణ్యతా వ్యవస్థల రూపకల్పనలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తోందని, దేశ సాంకేతిక నైపుణ్యంపై ప్రపంచ దేశాల విశ్వాసానికి ఇది నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







