విశాఖలో సందడి చేయనున్న 'శభాష్ నాయుడు'
- August 14, 2016
విశాఖలో 'శభాష్ నాయుడు' సందడి చేయబోతున్నాడు. ఈ శభాష్ నాయుడు ఎవరో 'దశావతారం' చిత్రం చూసిన వారికి తేలిగ్గా అర్ధమవుతుంది. విలక్షణ నటుడు కమల్‌హాసన్ అందులో పోషించిన పాత్ర పేరే 'శభాష్ నాయుడు'. ఆ పాత్రకు సినిమాలో మంచిపేరు రావడంతో అదే గెటప్, అదే టైటిల్‌తో కమల్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'శభాష్ నాయుడు' రూపొందుతోంది. ఇటీవల కమల్ కుడికాలికి గాయం కావడంతో తదుపరి షెడ్యూల్ వాయిదా పడింది. గతవారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన కమల్ ఇప్పుడు దాదాపు కోలుకున్నారు. సైకోథెరపీతో పాటు కాలికి బలం పుంజుకునేందుకు జిమ్మింగ్ కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మళ్లీ 'శభాష్ నాయుడు' తదుపరి షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో విశాఖపట్నంలో ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఇంతవరకూ సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కమల్‌తో పాటు శృతిహాసన్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, సౌరబ్ శుక్లా తదితరులు నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. కథ, సహనిర్మాణంతో పాటు కమల్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







