చదువు పూర్తికాగానే సినిమాల్లోకి మోక్షజ్ఞ - బాలయ్య
- August 14, 2016
టాలీవుడ్ ప్రముఖ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా రంగం ప్రవేశంపై తన మనసులోని మాటను బయట పెట్టారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా బాలకృష్ణ సరికొత్త రీతిలో భక్తులకు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులకు తన కుమారుడి సినిమా ప్రవేశంపై నోరు మెదిపారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై చాలా కాలం నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. పలువురు దర్శకులు అప్పుడే మోక్షజ్ఞ సినిమా కోసమని స్క్రిప్ట్స కూడా రడీ చేసుకుంటున్నారన్నట్లు పలు రకాలుగా ఊహాగానాలు చెలరేగాయి. అయితే బాలకృష్ణ ఆ విషయంపై స్పందిస్తూ మోక్షజ్ఞ తప్పకుండా సినిమాల్లోకి వస్తాడు, హీరోగా అద్భుతమైన చిత్రాలు చేస్తాడు. అయితే అది ఇప్పుడు కాదు. అతడు ఇప్పుడు చదువులో ఉన్నాడు. అది అయిపోయిన వెంటనే అంటే వచ్చే యేడాది చివరికల్లా సినీ ప్రవేశం ఉంటుంది అన్నాడు. అంటే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం 2017 డిసెంబర్ నాటికి కావచ్చన్న మాట. కాగా బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ అమరావతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంలో చేస్తున్నాట్లుగా వివరించారు. కృష్ణ పుష్కర స్నానం కూడా బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి వేషధారణలోనే ఆచరించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..







