సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- July 28, 2026
మస్కట్:సోషల్ మీడియా వేదికల ద్వారా పిల్లలపై జరుగుతున్న దోపిడీ ఘటనలు పెరుగుతున్నాయని ఒమాన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల డిజిటల్ దోపిడీని నేరంగా పరిగణించే ప్రత్యేక చట్టాలను తీసుకురావడంతో పాటు, బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ఏడాదిలో కమిషన్ ఫిర్యాదుల స్వీకరణ, పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపింది.
సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ కావడంతో పాటు, ఫిర్యాదులు నమోదు చేసే విధానాలను కూడా విస్తరించి ఆధునికీకరించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా, సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు, నిరంతర పర్యవేక్షణను ముమ్మరం చేసినట్లు పేర్కొంది. వ్యక్తుల హక్కుల పరిరక్షణను మరింత సమర్థంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.
2025 సంవత్సరంలో మానవ హక్కులకు సంబంధించిన 1,479 ఫిర్యాదులు అందినట్లు కమిషన్ వెల్లడించింది. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, చట్టపరమైన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.దాఖలైన ప్రతి కేసును లోతుగా అధ్యయనం చేసి, జాతీయ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా పరిష్కార మార్గాలను అమలు చేస్తున్నట్లు ఒమాన్ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







