యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- July 28, 2026
అబుదాబి:యూఏఈ మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) 2026 తొలి ఆరు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల నియామకానికి సంబంధించిన 42 రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై 135 చట్టపరమైన, పరిపాలనా ఉల్లంఘనల కారణంగా జరిమానాలు విధించినట్లు ప్రకటించింది. 135 ఉల్లంఘనల్లో 106 కేసులు యజమానులకు చట్టం ప్రకారం తిరిగి చెల్లించాల్సిన నియామక రుసుమును పూర్తిగా లేదా పాక్షికంగా నిర్ణీత గడువులోగా చెల్లించకపోవడానికే సంబంధించినవని పేర్కొంది.
డొమెస్టిక్ వర్కర్ చట్టం అమలు నిబంధనల ప్రకారం.. వర్కర్ ఏజెన్సీకి తిరిగి వచ్చిన తేదీ లేదా పని మానేసినట్లు సమాచారం అందిన తేదీ నుంచి రెండు వారాల్లోపు యజమానికి రిక్రూట్‌మెంట్ ఫీజును తిరిగి చెల్లించడం తప్పనిసరి.యజమానుల హక్కులను పరిరక్షించడం, ఒప్పంద సంబంధాల్లో వివాదాలను నివారించడం కోసం ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అలాగే, డొమెస్టిక్ వర్కర్ల నియామకానికి సంబంధించిన ఆమోదిత నిబంధనలు, విధివిధానాలను పాటించని 29 ఉల్లంఘనలు కూడా గుర్తించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం యూఏఈలో 138 లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటిలో చాలా ఏజెన్సీలు నిబంధనలను పాటిస్తూ, నాణ్యమైన సేవలు, పారదర్శకతను కొనసాగిస్తున్నాయని మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.
ఉల్లంఘనలకు పాల్పడే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ తనిఖీ, పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపింది. అలాగే, ఏదైనా అక్రమాలు లేదా లోపాలు గమనించిన వినియోగదారులు మంత్రిత్వ శాఖ అధికారిక డిజిటల్ వేదికలు లేదా 80084 లేబర్ క్లెయిమ్స్ అండ్ అడ్వైజరీ కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. అదే సమయంలో యజమానులు తప్పనిసరిగా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదైన లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలతోనే లావాదేవీలు జరపాలని, ఒప్పందంపై సంతకం చేసే ముందు సంబంధిత నిబంధనలు, విధానాలను పూర్తిగా పరిశీలించాలని మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







