డబ్బింగ్ దశలో 'ఆక్సిజన్'
- August 14, 2016
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా. నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ ''గోపీచంద్ హీరోగా మేం రూంపొందిస్తున్నాఆక్సిజన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇప్పటి వరకు సినిమా 90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అలాగే చిత్రీకరణకు సమాంతరంగా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో సినిమా చేస్తున్నాం. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. సెప్టెంబర్ నెలలో ఆడియో విడుదల చేసి అదే నెలలో సినిమాను కూడా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. గోపీచంద్, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్ శ్యామ్, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్:పీటర్ హెయిన్, ఆర్ట్: మిలన్, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







