కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- July 28, 2026
తిరువనంతపురం: బహ్రెయిన్‌లో స్థిరపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త పాంబవాసన్ నాయర్ నేతృత్వంలోని సీఎంఎన్ (చంద్రమ్మ–మాధవన్ నాయర్) ట్రస్ట్ ఆధ్వర్యంలో కేరళలోని నిరుపేద కుటుంబాలకు నిర్మించిన 13 కొత్త ఇళ్లను అధికారికంగా అందజేశారు. ఒట్టపాలంలో నిర్వహించిన ‘ఎ హోమ్ ఆఫ్ యువర్ ఓన్’ (A Home of Your Own) పథకం తాళాల పంపిణీ కార్యక్రమాన్ని కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ప్రారంభించారు.
2024 ఆగస్టు 25న సీఎంఎన్ ట్రస్ట్ చైర్మన్ పాంబవాసన్ నాయర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో 50 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నిర్దేశిత గడువుకంటే ముందుగానే 48 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా, మరో 10 ఇళ్ల నిర్మాణానికి అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కూడా ఈ సందర్భంగా కుదిరాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ మాట్లాడుతూ..ఇతరుల కష్టాలను తమవిగా భావించి సేవ చేయడం పాంబవాసన్ నాయర్‌కు ఉన్న గొప్ప లక్షణమని కొనియాడారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు, ట్రస్టులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల ద్వారా గృహనిర్మాణం, వైద్య సేవల వంటి రంగాల్లో అందిస్తున్న సహాయం ప్రజా సంక్షేమానికి ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణంతో పాటు ‘అనుగ్రహ హోమ్స్’ పేరుతో భూమిలేని నిరుపేద కుటుంబాల కోసం మరో ఆరు ఇళ్ల నిర్మాణం కూడా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం మున్నూర్కోడ్లోని 30 సెంట్ల భూమిని పాంబవాసన్ నాయర్ స్వయంగా విరాళంగా అందించారు.సీఎంఎన్ ట్రస్ట్ గృహ నిర్మాణంతో మాత్రమే కాకుండా, వైద్య సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, వివాహ సహాయం, నెలవారీ పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా 125కుపైగా బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని, బహ్రెయిన్ ప్రవాస భారతీయులు సమాజాభివృద్ధికి అందిస్తున్న సేవలను అభినందించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







