యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- July 28, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలు మరియు అంతర్జాతీయ సహకారంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. యూరప్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ప్రముఖ ప్రవాస భారతీయుడు జయ్ కుమార్ గుంటుపల్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి యూరప్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జయ్ కుమార్ గుంటుపల్లి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు.
యూరప్‌లో పెట్టుబడులను ఆకర్షించడం, ప్రముఖ సంస్థలతో పారిశ్రామిక భాగస్వామ్యాలను ఏర్పరచడం, అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో కొత్త అవకాశాలు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను రాబట్టడంతో పాటు, అంతర్జాతీయ సంస్థలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో ఈ నియామకం కీలకంగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!







