బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- July 29, 2026
మనామా: గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు బహ్రెయిన్‌లోని సదర్న్ గవర్నరేట్‌లో ఒక వాణిజ్య సంస్థను మూసివేశారు. ఆహార భద్రత, ఉత్పత్తుల లేబులింగ్, ధరల నిబంధనలను ఉల్లంఘించినట్లు తనిఖీల్లో తేలడంతో ఈ చర్యలు చేపట్టినట్లు పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల సందర్భంగా ఈ ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయని, తనిఖీల్లో గడువు తేదీ లేకుండా ఉన్నవి, అలాగే గడువు ముగిసిన నెయ్యి, వివిధ రకాల పాస్తా, ఫ్రోజన్ మాంసాహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.
కొన్ని ఉత్పత్తులపై చేతితో రాసిన లేదా విడిగా అంటించిన గడువు తేదీలు కనిపించడంతో వాటి ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వాటిని ఆరోగ్య, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి అధికారులు పరీక్షలు చేపట్టారు.ఉల్లంఘనలు నిర్ధారణ కావడంతో సంబంధిత దుకాణాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో మూసివేశారు. అదే సంస్థకు చెందిన ఇతర శాఖల్లో కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని, చట్టాలు, నిబంధనల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే అనుమానాస్పద ఉత్పత్తులు లేదా నిబంధనల ఉల్లంఘనలపై వినియోగదారులు అధికారిక ఫిర్యాదు వ్యవస్థ ద్వారా సమాచారం అందించాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







