బహ్రెయిన్‌లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- July 29, 2026
మనామా: బహ్రెయిన్‌లో మనీలాండరింగ్ కేసులో ఓ ఆసియా దేశానికి చెందిన డొమెస్టిక్ వర్కర్ కు కోర్టు కఠిన శిక్ష విధించింది. 30 ఏళ్ల మహిళకు 5 సంవత్సరాల జైలు శిక్ష, BD100,000 జరిమానా విధించడంతో పాటు శిక్ష పూర్తయిన అనంతరం దేశం నుంచి బహిష్కరించాలని ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
కోర్టు తీర్పు ప్రకారం, నేరానికి సంబంధించిన BD22,250 మొత్తాన్ని ఆమె ఆస్తులు లేదా నిధుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అలాగే ఆమె బ్యాంకు, ఆర్థిక ఖాతాల్లో ఉన్న BD775.810ను బాధితుడికి తిరిగి చెల్లించాలని సూచించింది.
డిజిటల్ సైన్ దుర్వినియోగం, తప్పుడు సమాచారం సమర్పించడం, ఐటీ వ్యవస్థలో అనధికార ప్రవేశం ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును మనీలాండరింగ్ చేసినట్లు ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి.
కోర్టు పత్రాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 22 మధ్య ఈ నేరాలు జరిగాయి. అక్రమంగా పొందిన డబ్బును స్థానిక, అంతర్జాతీయ లావాదేవీల ద్వారా బదిలీ చేసి, ఆ నిధుల అసలు మూలాన్ని దాచిపెట్టేందుకు ఆమె ప్రయత్నించినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







