సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- July 29, 2026
జెడ్డా: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్.. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ తాజా పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.
సౌదీ అరేబియా–స్పెయిన్ మధ్య వివిధ రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించిన ఇద్దరు నేతలు.. పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఉభయ దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా రెడ్ సిలో సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు జరుపుతున్న దాడులను స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు హౌతీల నుంచి వస్తున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే సౌదీ అరేబియా భద్రత, సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం రాజ్యం చేపడుతున్న చర్యలకు స్పెయిన్ పూర్తి మద్దతు ఉంటుందని సాంచెజ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







