యూఏఈలో ఆగస్టు 3 వరకు వర్షాలు..!!
- July 30, 2026
అబుదాబి: మండే వేసవి ఎండల మధ్య యూఏఈ ప్రజలకు ఊరటనిచ్చే వార్త. ఆగస్టు 3 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ప్రకటించింది. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వాతావరణ నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో (El Niño) ప్రభావంతో యూఏఈలో గాలిలో తేమ శాతం పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపారు.
ఎన్సీఎం వాతావరణ శాస్త్రవేత్త అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవి కాలంలో ఎల్‌నినో ప్రభావం తూర్పు ఆసియాపై ఎక్కువగా ఉన్నప్పటికీ, అక్టోబర్, నవంబర్ నెలల్లో యూఏఈ సహా పశ్చిమ ఆసియాపై దీని ప్రభావం మరింత పెరుగుతుందని చెప్పారు. దీంతో రానున్న నెలల్లో వర్షాల అవకాశాలు కూడా అధికమవుతాయని పేర్కొన్నారు.
ఇటీవల ఫుజైరా, రాస్ అల్ ఖైమా, అల్ ఐన్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు కొన్ని చోట్ల వడగళ్ల వాన నమోదైంది. ఇదే పరిస్థితి మరో కొన్ని రోజులు కొనసాగుతుందని ఎన్సీఎం అంచనా వేసింది.
45 నుంచి 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
వచ్చే ఐదు రోజుల పాటు దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో 38 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఎన్సీఎం సూచనలు
వర్షాల తీవ్రతను బట్టి ఎల్లో, ఆరేంజ్, రెడ్ హెచ్చరికలు జారీ చేస్తామని ఎన్సీఎం తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, వరదలు వచ్చే అవకాశం ఉన్న లోయలు, వాడీలకు వెళ్లొద్దని సూచించింది. అలాగే అధికారిక వాతావరణ హెచ్చరికలను మాత్రమే నమ్మాలని, పుకార్లను వ్యాప్తి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







