తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- July 30, 2026
తిరుమల: టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ ద్వారా శ్రీవారి భక్తులను మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీటీడీ హెచ్చరించింది. దర్శనం, సేవా టికెట్ల బుకింగ్ పేరుతో భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్ విభాగం.. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
తిరుమల శ్రీవారి భక్తులను లక్ష్యంగా చేసుకుని టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దర్శనం, సేవా టికెట్ల బుకింగ్ పేరుతో భక్తుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘TTDDevasthanam.Online’ పేరుతో ఉన్న ఈ నకిలీ వెబ్సైట్లో సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, తోమాల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటి సేవలకు బుకింగ్‌లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నారు. ప్రతి సేవకు ప్రత్యేకంగా ధరలు నిర్ణయించి, వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఒక్కో భక్తి నుంచి రూ.10,500 వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అదనపు లడ్డూలకు ఒక్కోదానికి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా కేవలం డొమైన్ పేరులో స్వల్ప మార్పులు చేసి ఈ నకిలీ సైట్‌ను రూపొందించారని అధికారులు తెలిపారు. ఇందులో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







