దక్షిణ ఇరాన్ పై విరుచుకపడ్డ అమెరికా వైమానిక దళం!
- July 30, 2026
మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇరాన్ (America-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. జోర్డాన్, ఈజిప్టులపై జరిగిన దాడులకు ప్రతీకారంగా వాషింగ్టన్ వైమానిక దళం టెహ్రాన్ లక్ష్యంగా భీకర వైమానిక దాడులు ప్రారంభించింది. క్షిపణులు, బాంబుల వర్షంతో దక్షిణ ఇరాన్‌తో పాటు ఖేష్మ్ ద్వీపం విలవిలలాడింది. కుజెస్తాన్ ప్రావిన్స్‌లోని నాలుగు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. అహ్‌వజ్ నగరంలో ఒక కీలక విద్యుత్ సబ్‌స్టేషన్ ధ్వంసమైంది. ఖేష్మ్ ద్వీపంలో ఒక నివాస భవనంపై క్షిపణి పడటంతో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గల్ఫ్ ప్రాంతంలోని ప్రముఖ కిష్ ద్వీపంపై కూడా క్షిపణి దాడి జరిగినప్పటికీ, ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. జాతీయ విద్యుత్ గ్రిడ్‌పై క్షిపణులు పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కీలకమైన ఓడరేవు నగరం బందర్ అబ్బాస్‌లో క్షిపణి శిథిలాలు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. బుషెహర్ ప్రావిన్స్‌లో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా IRIB తెలిపింది. ఇరాన్ అణువిద్యుత్ కేంద్రం ఈ ప్రావిన్స్‌లోనే ఉంది, అయితే ఈ కేంద్రానికి ఏమైనా నష్టం జరిగిందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అమెరికా ప్రకటన & ఇరాన్ హెచ్చరిక
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)కి చెందిన వ్యూహాత్మక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (USCENTCOM) సామాజిక మాధ్యమం ‘X’ ద్వారా అధికారికంగా తెలిపింది. ఇరాన్‌కు చెందిన మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి మరియు డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత నిఘా మరియు రక్షణ స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అమెరికా చేసిన ఈ వైమానిక దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యలకు తగిన రీతిలో, గట్టిగా బదులిస్తామని ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







