మహిళ జీతం క్లెయిమ్‌ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- July 31, 2026
మనామా: బకాయి జీతాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, పరిహారం కలిపి 1,200 బహ్రెయిన్ దినార్లు (BD) చెల్లించాలని ఓ అరబ్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బహ్రెయిన్ లేబర్ కోర్టు కొట్టివేసింది. తాను పెస్ట్ అండ్ ఎపిడెమిక్ కంట్రోల్ స్పెషలిస్ట్ గా నెలకు BD400 జీతంతో పనిచేశానని మహిళ కోర్టుకు తెలిపింది.
అయితే, ఆమెకు ఉద్యోగ హోదా కల్పించేందుకు కాకుండా, ఇన్వెస్టర్ వీసా వచ్చే వరకు నివాస అనుమతి (రెసిడెన్సీ) పొందేందుకు మాత్రమే ఉద్యోగ ఒప్పందాన్ని రూపొందించామని కంపెనీ వాదించింది.సాక్షుల వాంగ్మూలాలు, వాట్సాప్ సందేశాలు, ఈ-మెయిళ్లను పరిశీలించిన కోర్టు.. మహిళ సంస్థలో ఉద్యోగిగా విధులు నిర్వహించలేదని, ఇరు పక్షాల మధ్య సంబంధం ఉద్యోగి-యజమాని సంబంధం కాదని, వ్యాపార భాగస్వామ్యమేనని నిర్ధారించింది. దీంతో మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ, న్యాయపరమైన ఖర్చులు, న్యాయవాదుల ఫీజులను కూడా ఆమెనే చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







