సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- July 31, 2026
రియాద్: రెడ్ సీ, బాబ్ అల్-మందబ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి సౌదీ అరేబియా నేతృత్వంలో అంతర్జాతీయ సముద్ర రక్షణ కూటమి (Multinational Maritime Defense Alliance)ఏర్పాటు చేయాలని వ్యవస్థాపక సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ కూటమికి సౌదీ అరేబియా నేతృత్వం వహించనుంది. ఈ మేరకు సంయుక్త ప్రకటనలో సభ్య దేశాలు స్పష్టం చేశాయి. ప్రపంచ సముద్ర భద్రతకు పెరుగుతున్న ముప్పులను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛ, ప్రపంచ వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా మార్గాల రక్షణ కోసం పరస్పర సహకారం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.
కూటమి అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఒప్పందాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తూ సముద్ర భద్రతను పెంపొందించడం, అంతర్జాతీయ నౌకాయానాన్ని రక్షించడం, సభ్య దేశాల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కూటమి జాయింట్ కమాండ్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, జాయింట్ మెరిటైమ్ ఆపరేషన్స్ సెంటర్, జనరల్ సెక్రటేరియట్ వంటి కీలక కార్యనిర్వాహక విభాగాలను సౌదీ అరేబియాలో ఏర్పాటు చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి.
అలాగే సముద్ర భద్రత, రహస్య సమాచారం పంచుకోవడం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలు, సంయుక్త విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు, సముద్ర ఆపరేషన్లలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి. ఈ కూటమి పూర్తిగా రక్షణాత్మక లక్ష్యాలతోనే ఏర్పాటైందని, ఏ దేశం లేదా అంతర్జాతీయ సంస్థకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. ప్రతి సభ్య దేశం తన సార్వభౌమాధికారానికి అనుగుణంగానే కూటమి కార్యకలాపాల్లో పాల్గొనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
కాగా, ఈ కూటమి ఏర్పాటుకు సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, పాకిస్థాన్, టర్కియే, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, బంగ్లాదేశ్, నైజీరియా, సూడాన్, జిబౌటి, సోమాలియా మద్దతు ప్రకటించాయి. మరికొన్ని దేశాలు కూడా తమ అంతర్గత ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత ఈ కూటమిలో చేరనున్నట్లు వెల్లడించాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







