కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- July 31, 2026
న్యూ ఢిల్లీ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ కారు లేదా బైక్ ఏదైనా ఇతరులకు అమ్మేస్తున్నారా? లేదా పాత వాహనం ఏదైనా కొంటున్నారా? అయితే, జర జాగ్రత్త.. ఇకపై వాహనం ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ విషయంలో ఆధార్ తప్పనిసరి.. చాలామంది వాహనం అమ్మిన తర్వాత ఓనర్షిప్ ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు.
ఇప్పటి వరకూ ఆధార్ అవసరం లేకుండానే ఈజీగా ట్రాన్స్ ఫర్ ప్రాసెస్ జరిగేది. ఇకపై అలా కాదు.. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ (Vehicle Ownership Transfer) విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్ డిటెల్స్ ఒకరి పేరు మీద నుంచి మరొకరికి ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది.
ఈ కొత్త విధానం ప్రకారం, వాహన యజమాని తమ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాహన యాజమాన్య బదిలీ జరుగుతుంది.
ఇందు కోసం కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకురాగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ఆధారంగా ఈ మార్పులను అమలు చేస్తున్నట్లు మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ (MVD) తెలిపింది.
ప్రధాన ప్రయోజనాలివే:
ఈ కొత్త విధానం ద్వారా బైకు లేదా కారు రిజిస్ట్రేషన్ వివరాలను మరొకరి పేరుకు ట్రాన్స్ ఫర్ చేసే సందర్భాల్లో ఎక్కువగా లంచాల రూపంలో డబ్బు చేతులు మారుతుంది. వాహనాలకు సంబంధించి ఇలాంటి నేరాలను అరికట్టడంతో పాటు సేఫ్టీ కోసం మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో అవినీతిని అరికట్టవచ్చు. పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా ఆఫ్ లైన్ డాక్యుమెంట్ల అవసరం ఉండదు.
దాంతో ఆధార్ ఆధారిత సర్వీసులో దరఖాస్తుదారులు ఇకపై ఆర్టీఓ ఆఫీసుల్లో డాక్యుమెంట్ల హార్డ్ కాపీలను ఇవ్వాల్సిన పనిఉండదు. అలాగే, మధ్యవర్తుల ద్వారా సమర్పించిన దరఖాస్తులను అధికారులు గుర్తించడం కష్టమే. కానీ, లంచాలకు బదులుగా ఏజెంట్ల సపోర్టు ఉన్న ఫైళ్లను వేగవంతం చేసే పద్ధతికి అడ్డుకట్ట పడుతుంది.
ఆఫీసులో పనిభారం తగ్గుతుంది:
ఎంవీడీ కార్యాలయాలకు అందే అన్ని దరఖాస్తులలో దాదాపు 40 శాతం వాహన యాజమాన్య బదిలీలకు సంబంధించినవే ఉంటాయి. ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌కు మార్చడం వల్ల పరిపాలనా పనిభారం భారీగా తగ్గుతుందని భావిస్తున్నారు.
వాహన యజమానులు ఏం చేయాలంటే?
ఆధార్‌ను తమ వాహన రికార్డులకు ఇంకా లింక్ చేయని వాహన యజమానులు వెంటనే పూర్తి చేయాలి. రెండు డేటాబేస్‌ల మధ్య డేటా ఒకేలా ఉండాలి. అప్పుడే ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
1. పేరు మ్యాపింగ్ చేయడం : వాహన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉన్న యజమాని పేరు, వారి ఆధార్ కార్డులో ఉన్న పేరుతో మ్యాచ్ కావాలి. లేదంటే లింకింగ్ ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది. యజమానులు తమ ఆధార్ వివరాలకు సరిపోయేలా తమ వాహన రికార్డులను అప్ డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకించి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
2. యాక్టివ్ మొబైల్ నంబర్ : ఆధార్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్లు ఇన్ యాక్టివ్ ఉన్న యజమానులు, వాటిని వాహన డాక్యుమెంట్లను లింక్ చేసే ముందు తమ మొబైల్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి.
పాత రిజిస్ట్రేషన్లు, లోన్ రిమూవల్ రూల్స్ :
2018కి ముందు ‘స్మార్ట్ మూవ్’ సాఫ్ట్‌వేర్‌పై రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు తాత్కాలిక మొబైల్ ఓటీపీ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అయితే, జాతీయ ‘వాహన్’ పోర్టల్ ద్వారా ఏదైనా సర్వీసును పొందిన తర్వాత ప్రొఫైల్ శాశ్వతంగా ఆధార్ లింకింగ్ వ్యవస్థకు మారుతుంది.
వాహన రికార్డుల నుంచి లోన్ లేదా తాకట్టు వివరాలను తొలగించే ప్రక్రియను కూడా ఫేస్లేస్గా మార్చారు. అప్లికేషన్ పంపిన వెంటనే ఆర్థిక సంస్థకు ఒక ఆటోమేటెడ్ ఆన్లైన్ నోటిఫికేషన్ వెళ్తుంది. అప్పుడు లోన్ ప్రొవైడర్ సదరు వ్యక్తికి ఎలాంటి బకాయిలు లేవని నిర్ధారించిన వెంటనే సాఫ్ట్వేర్ ఆటోమాటిక్‌గా లోన్ రికార్డును తొలగిస్తుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







