అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- August 01, 2026
పవిత్ర అమర్నాథ్ యాత్ర శనివారం మళ్లీ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులకు తీవ్ర ఉపశమనం లభించింది. వర్షాలు తగ్గడం, వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు బల్తాల్ మార్గంలో యాత్రను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. భక్తులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకునేందుకు ఈ మార్గంలో అనుమతులు పునరుద్ధరించారు. ప్రతికూల వాతావరణం, రోడ్లు దెబ్బతినడం వల్ల శుక్రవారం ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయగా, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు పూర్తి చేయడంతో శనివారం ఉదయం నుంచి యాత్ర(Amarnath Yatra) తిరిగి సజావుగా సాగుతోంది.
పహల్గాం మార్గంలో ఆంక్షలు కొనసాగింపు:
మరొక ప్రధాన మార్గమైన పహల్గామ్ వైపు మాత్రం ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేశారు. దీనికి తోడు జమ్మూ-శ్రీనగర్ 250 కిలోమీటర్ల జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రహదారి దెబ్బతినడంతో భాగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరాల్సిన భక్తులను ప్రస్తుతం అక్కడే నిలిపివేశారు.
ముమ్మరంగా సాగుతున్న మంచులింగ దర్శనాలు:
గత నెల 3న ప్రారంభమైన ఈ వార్షిక యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 4.5 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహలోని మంచులింగాన్ని దర్శించుకుని తారకమంత్ర స్మరణతో పులకించిపోయారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మిగిలిన మార్గాల్లో కూడా పరిస్థితులు చక్కబడిన వెంటనే యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల చివరి వరకు ఈ అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







