బాల్టిమోర్‌లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- August 02, 2026
హైదరాబాద్: అమెరికాలోని బాల్టిమోర్‌లో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభల సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు & ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులతో ముఖాముఖి సమావేశమయ్యారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రవాసుల (ఎన్ఆర్ఐలు) సమస్యలు, సంక్షేమం, తెలంగాణతో వారి అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిటీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విదేశాల్లోని తెలుగు సంఘాలతో సమన్వయం, తెలంగాణలో పెట్టుబడులు, పర్యాటక రంగ అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవాస తెలుగువారితో ప్రభుత్వ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై పలు సూచనలు చేశారు.
ప్రవాస తెలుగువారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటడంలో ప్రవాస తెలుగువారి పాత్ర ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడులు, పర్యాటక ప్రోత్సాహం, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







