తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక

- August 02, 2026 , by Maagulf
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) 13వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2న లిటిల్ ఇండియాలోని కుర్తాళం బోర్డర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 65 నుంచి 70 మంది సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో ముందుగా 12వ సర్వసభ్య సమావేశపు వివరాలు, 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం-వ్యయాల నివేదికను సభ్యులకు వివరించి ఆమోదం పొందారు. అనంతరం సభ్యులు సమ్మయ్య మోలుగూరి సహా పలువురు అడిగిన ప్రశ్నలకు మాజీ అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇచ్చారు. సమావేశానికి ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మోడరేటర్‌గా వ్యవహరించారు.

2025–2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన, నీలం సుఖేందర్‌లకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన నల్ల భాస్కర్ గుప్త మరియు ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం ప్రకటించారు. నామినేషన్ గడువులో ఒకే బృందం నుంచి దరఖాస్తు రావడంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించారు.

నూతన అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త మాట్లాడుతూ, సభ్యులందరి సహకారంతో తెలంగాణ కల్చరల్ సొసైటీని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటివరకు సొసైటీ అభివృద్ధికి సహకరించిన కార్యవర్గ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, ప్రతి సభ్యుడికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సభ్యులు చేసిన సూచనలను స్వీకరించి వాటిని అమలు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని కొత్త కార్యవర్గం హామీ ఇచ్చింది.

2026–2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారులను సభ్యులు ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గం

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శిగా బొందుగుల రాము, కోశాధికారిగా శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల బాధ్యతలు చేపట్టనున్నారు.

సంస్థాగత కార్యదర్శిగా కాసర్ల శ్రీనివాసరావు, ప్రాంతీయ కార్యదర్శులుగా నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బొడ్ల రోజా రమణి, రవికృష్ణ విజ్జాపూర్, పెరుకు శివరామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా కృష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్, యసరావేణి విజయకుమార్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు.

మాజీ అధ్యక్షుడు రమేష్ బాబుకు ఘన సన్మానం

సమావేశంలో మాజీ అధ్యక్షుడు గడప రమేష్ బాబు చేసిన విశిష్ట సేవలను ప్రత్యేక ఆడియో-విజువల్ (AV) ప్రదర్శన ద్వారా గుర్తు చేస్తూ ఘనంగా సన్మానించారు. గత 12 సంవత్సరాలుగా ఆయన సొసైటీ అభివృద్ధికి అందించిన సేవలను మాజీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ కొనియాడారు.

ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన రమేష్ బాబు మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా సొసైటీలో సభ్యుడిగా, రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా సేవ చేసే అవకాశం కల్పించిన సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే సొసైటీ కార్యకలాపాలకు నిరంతరం సహకరిస్తున్న దుర్గాప్రసాద్, సుగుణాకర్ రెడ్డిలకు కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సభ్యులందరికీ కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేసింది. అనంతరం ఏర్పాటు చేసిన హైటీని సభ్యులు ఆస్వాదిస్తూ సమావేశాన్ని ముగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com