'కింగ్ 100' సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
- August 02, 2026
కింగ్ నాగార్జున అక్కినేని మైల్ స్టోన్ 100వ పై చిత్రంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకులలో ఒకరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు.
ఆదివారం డీఎస్పీ 47వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసి ఆయనకు 'కింగ్ 100' టీమ్‌లో ఘన స్వాగతం పలికారు.
నాగార్జున - దేవిశ్రీ ప్రసాద్ లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. నాగార్జున 'మన్మథుడు', 'మాస్', 'కింగ్', 'కుబేర' చిత్రాలకు డీఎస్పీ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మైలురాయి చిత్రానికి కూడా అదే స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి.
చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్, ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన దేవిశ్రీ ప్రసాద్, 'కింగ్ 100' కోసం కూడా మరో గుర్తుండిపోయే మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడ మా ఆవిడే' వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత నాగార్జున-టబు కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది.
ఇప్పుడు డీఎస్పీ ఎంట్రీతో 'కింగ్ 100' పై అంచనాలు మరింత పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను వెల్లడించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధమవుతోంది.
తారాగణం: కింగ్ నాగార్జున, టబు
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రా కార్తీక్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్‌లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి







