సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- August 02, 2026
సెయింట్ లూయిస్: భాషే రమ్యం..సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ తన సేవా నిబద్ధతను ప్రతి నెల చాటుకుంటూనే ఉంది.సెయింట్స్ లూయిస్ లోని మహాత్మా గాంధీ సెంటర్ వేదికగా ప్రవాస తెలుగు ప్రజల కోసం ఒక ఉచిత మెడికల్ క్యాంప్‌ను నాట్స్ మిస్సోరీ విభాగం నిర్వహించింది. ప్రతి మాసం ఇలా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం నాట్స్ మిస్సోరీ విభాగం ఒక బాధ్యతగా భావిస్తోంది.
వృత్తిపరమైన బిజీలో ఉన్నప్పటికీ, తోటి వారికి సాయపడాలనే విశాల దృక్పథంతో ఈ వైద్య శిబిరానికి ప్రముఖ వైద్యులు ముందుకు నాట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు డా. సుధీర్ అట్లూరి, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డా.బాపూజీ దార్శిలు స్వయంగా ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఎంతో ఓపికతో రోగులను పరీక్షించారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కేవలం వైద్య చికిత్స మాత్రమే కాకుండా, ధైర్యాన్నిస్తూ తగు సలహాలు, సూచనలు అందించారు.
"సేవ" అనేది ఒకరిద్దరితో అయ్యేది కాదు, అది అందరి సమష్టి కృషితో సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది. ఈ బృహత్కార్యం విజయవంతం వెనుక నాట్స్ ఎన్.సి. జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపరతో పాటు నాట్స్ నాయకులు నాగ శ్రీనివాస్ శిష్ట్ల, మిస్సోరీ చాప్టర్ నాయకులు, వాలంటీర్లు తమ విలువైన సేవలను అందించారు. నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన నాట్స్ మిస్సోరీ విభాగాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో సేవలు అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







