సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- August 03, 2026
సలాలా: ఒమన్‌లోని సలాలా విలాయత్‌లో 9వ ఒమన్-బహ్రెయిన్ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఒమన్-బహ్రెయిన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్, ఒమన్‌లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్లో ఇరు దేశాలకు చెందిన పలు చిన్న, మధ్య తరహా సంస్థలు (SMEs) పాల్గొంటున్నాయి. తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించేందుకు వ్యాపారవేత్తలకు ఈ వేదికను అందిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వ్యాపారవేత్తలు ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ రంగాల్లో తమ అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఒమన్, బహ్రెయిన్ దేశాల సాంస్కృతిక, హస్తకళా, వారసత్వ వైవిధ్యాన్ని ఈ ఎగ్జిబిషన్ ప్రతిబింబిస్తోంది. రెండు దేశాల ప్రత్యేక ఉత్పత్తులను సందర్శకులకు పరిచయం చేస్తూ భవిష్యత్ ఆర్థిక, పెట్టుబడి భాగస్వామ్యాలకు వేదికగా నిలుస్తుందని ఒమన్-బహ్రెయిన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ చైర్పర్సన్ రుదైనా అమెర్ అల్ హజ్రీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ప్రదర్శన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 30 చిన్న, మధ్య తరహా సంస్థలు పాల్గొంటున్నాయని, ఫ్యాషన్ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఒమన్ ఫ్రాంకిన్సెన్స్ (లుబాన్), ఒమన్ హల్వా, ఆభరణాలు, సంప్రదాయ హస్తకళా వస్తువులు, గృహోపకరణాలు వంటి విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఈ ప్రదర్శన రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను విస్తరించడంతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారాల అభివృద్ధికి కీలక వేదికగా మారుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







