షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- August 05, 2026
కువైట్ : కువైట్‌లోని షేక్ జాబర్ బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకిన ఓ మహిళను అగ్నిమాపక, మెరైన్ రెస్క్యూ బృందాలు సకాలంలో రక్షించాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అల్-జౌన్ మెరైన్ సెంటర్, షేక్ జాబర్ బ్రిడ్జ్ మెరైన్ ఫైర్ అండ్ రెస్క్యూ సెంటర్‌కు చెందిన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.
సముద్రంలో పడిన మహిళను సురక్షితంగా బయటకు తీసి అత్యవసర వైద్య సిబ్బందికి అప్పగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు, మహిళ వ్యక్తిగత వివరాలను అధికారులు వెల్లడించలేదు.
సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన అగ్నిమాపక, మెరైన్ రెస్క్యూ సిబ్బందిని జనరల్ ఫైర్ ఫోర్స్ అభినందించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్







