,'రామ్, సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో 'హైపర్' ..
- August 15, 2016
'హైపర్ యాక్టివ్ ఉన్న ఒక కుర్రాడు మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలియాలంటే 'హైపర్' సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రామ్, రాశిఖన్నా జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం 'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). వైజాగ్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ,'రామ్, సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌తో టాకీపార్ట్ మొత్తం పూర్తవుతుంది. సెప్టెంబర్ 9కి పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్ రెండోవారంలో ఆడియో రిలీజ్ చేసి, సెప్టెంబర్ 30న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







