‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్..
- August 08, 2026
కేజీఎఫ్’ చాప్టర్ 2తో ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్, చాలా కాలం తర్వాత హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులు, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈవెంట్లో చిత్రబృందం ‘టాక్సిక్’ థియేట్రికల్ ట్రైలర్(Toxic Trailer)ను లాంచ్ చేసింది. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎలిమెంట్స్, విజువల్ గ్రాండ్నెస్తో కూడిన ఈ ట్రైలర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
క్రైమ్ అండ్ డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో 1950-70ల నాటి పీరియాడిక్ పీరియడ్‌లో తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. గోవా నేపథ్యంగా సాగే ఈ కథలో యష్ అత్యంత పవర్ఫుల్ అండ్ స్టైలిష్ అవతార్‌లో కనిపించి మెస్మరైజ్ చేశారు. మలయాళ స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టేకింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉందనే ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలకు చెందిన నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషి వంటి క్రేజీ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా, ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది.
తాజా వార్తలు
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్‌లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్‌మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్‌పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్‌లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్‌కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!







