ఒమన్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- August 09, 2026
మస్కట్: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. అల్ హజర్ పర్వతాలు, పరిసర ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
అల్ వుస్తా, దోఫార్ గవర్నరేట్లకు చెందిన ఎడారి ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ.. సంబంధిత అధికారులు జారీ చేసే సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







