తల్లి కారణంగా వ్యభిచార రొంపిలోకి: గర్భం దాల్చిన బాలిక
- August 16, 201616 ఏళ్ళ బాలిక, తన తల్లి కారణంగా బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెట్టివేయబడింది. తద్వారా ఆమె గర్భం దాల్చింది. 42 ఏళ్ళ పాకిస్తాన్‌కి చెందిన మహిళ తన కుమార్తెన బలవంతంగా ఈ రొంపిలోకి తీసుకువచ్చింది. దాంతో బాధితురాలు 17 ఏళ్ళు నిండకుండానే గర్బం దాల్చింది. బ్యూటీసెలూన్‌లో పనిచేసేందుకు తన తల్లి తనను ఇక్కడికి తీసుకువచ్చిందనీ, అయితే వచ్చిన తర్వాత తన తండ్రి సమక్షంలో తాను వ్యభిచారం చేయాల్సిందిగా తల్లి ఆదేశించిందని విచారణలో బాలిక తెలిపింది. మొదట ఆ బాలిక వ్యతిరేకించినా, తన తల్లి బలవంతం చేయడం, బాధపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చిందని వివరించింది. మొదట తనను ఓ వ్యక్తి వద్దకు పంపించారనీ, ఆ వ్యక్తి తనతో సెక్స్‌లో పాల్గొన్నందుకుగాను 10,000 దిర్హామ్‌లు ఇచ్చాడనీ, తనను తీసుకు వెళ్ళిన మహిళ, ఆ సొమ్ము తీసుకుందని, ఆ తర్వాత ఆమె తనను వేరే వేరే వ్యక్తుల వద్దకు తీసుకెళ్ళి, డబ్బుల్ని సంపాదించేదనీ, ఆ మొత్తంలో కొంత భాగాన్ని తన తల్లి రోజువారీగా వసూలు చేసేదని బాధిత బాలిక వెల్లడించింది. 50 ఏళ్ళ పాకిస్తానీ వ్యాపారవేత్తతోపాటు బాధిత బాలిక తల్లిపై కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కేసులు నమోదు చేశారు. బాధితురాల్ని వైద్య పరీక్షలకు పంపగా, ఆమె 12 వారాల గర్భవతి అని తేల్చారు. దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆమె సంరక్షణ బాధ్యతల్ని చేపట్టింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 1న జరగనుంది.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







