మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- August 09, 2026
కోల్‌కతా విమానాశ్రయంలో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో అంతరాయం ఏర్పడింది. కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ పడటంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
కౌలాలంపూర్ నుంచి 159 మందితో వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH-184 శనివారం రాత్రి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సి ఉంది. విమానాశ్రయ వర్గాల ప్రకారం.. కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ వల్ల పైలట్ దృష్టి మరలింది.
వాస్తవానికి, శనివారం రాత్రి 11:20 గంటలకు విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. విమానాశ్రయ రన్‌వేకు సుమారు 8 నాటికల్ మైళ్ల దూరంలో విమానం ఉన్నప్పుడు మధ్యమ్‌గ్రామ్-బరసాత్ దిశ నుంచి కాక్‌పిట్ వైపు లేజర్ లైటింగ్ పడినట్టు పైలట్ గమనించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
చివరికి సేఫ్ ల్యాండింగ్:
లేజర్ నుంచి ఒక్కసారిగా వచ్చిన కాంతి కారణంగా పైలట్ క్షణకాలం పాటు అయోమయంగా అనిపించింది. దాంతో విమానం అనుకున్న సమయానికి ల్యాండ్ అవ్వలేకపోయింది. మరోసారి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించే ముందు గాలిలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరకు రాత్రి సుమారు 11:25 గంటలకు విమానం సేఫ్ ల్యాండ్ అయింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఘటన పై పోలీసులకు ఫిర్యాదు:
ఈ ఘటన అనంతరం.. విమానయాన సంస్థ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించింది. కోల్‌కతా విమానాశ్రయ యంత్రాంగం కూడా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వర్గాలు చెబుతున్నాయి.
విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ లైట్ల వాడకం నిషేధించినట్టు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ, ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని, విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
ఈ విషయాన్ని పోలీసు అధికారులకు రిపోర్టు చేశామని, దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో లేజర్ లైట్ల వల్ల ఆటంకం కలుగుతోందని పైలట్లు గతంలోనే ఫిర్యాదు చేశారు. 2025లో దుర్గా పూజ సందర్భంగా శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ పూజా పండల్ సమీపంలో లేజర్ లైట్లపై పైలట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత, లేజర్ షోను నిలిపివేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్







