బర్త్ డే నాడు మహేశ్ బాబు డబుల్ ట్రీట్..
- August 09, 2026
సూపర్‌స్టార్ మహేశ్ బాబు నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులకు డబుల్ ట్రీట్ లభించింది. ఒకవైపు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపగా, మరోవైపు మహేశ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో మహేశ్ 'రుద్ర' అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.
మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అందమైన ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. మహేశ్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ, "హ్యాపీ బర్త్ డే MB! ప్రతి రోజును ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు. ఈ ఏడాది నీకు ప్రేమ, ఆరోగ్యం, అనంతమైన సంతోషం లభించాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం" అని రాసుకొచ్చారు.
కుమార్తె సితార కూడా తండ్రికి ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేస్తూ, "హ్యాపీ బర్త్ డే నాన్న. ఎప్పటికీ నా ఫేవరెట్ పర్సన్ మీరే" అని తన ప్రేమను వ్యక్తపరిచింది.
మరోవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వారణాసి' చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వెదురు తెప్పపై ప్రశాంతంగా కూర్చున్న మహేశ్, మరో పోస్టర్లో అడవి మధ్యలో ప్రకృతిని చూస్తూ నిల్చున్న లుక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. "రుద్ర అంటే కేవలం భయంకరమైనవాడు మాత్రమే కాదు" అనే క్యాప్షన్‌తో ఈ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి 'రుద్ర' పాత్ర గురించి ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన నోట్‌ను పంచుకున్నారు. "రుద్ర ఒక గొప్ప ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి పుట్టాడు. తను అడగని ఒక విధిని మోస్తున్నాడు. అతను చమత్కారి, సున్నితమైనవాడు, అదే సమయంలో భయంకరమైనవాడు. మహేష్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. భయంకరంగా ఎవరైనా నటించగలరు, కానీ భయంకరంగా, సున్నితంగా ఒకేసారి నటించడం చాలా కొద్దిమందికే సాధ్యం" అని రాజమౌళి పేర్కొన్నారు.
ఆఫ్రికా షెడ్యూల్ అనుభవాలను వివరిస్తూ.. "ఈ ఫ్రేమ్స్ ఆఫ్రికా షెడ్యూల్లోనివి. కిలిమంజారో, మసాయ్ మారా ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్‌లో కూడా బంధించలేమని కొన్ని ఉదయాలు అనిపించింది" అని రాజమౌళి తెలిపారు. మొత్తంగా పుట్టినరోజున ఫ్యామిలీ విషెస్‌తో పాటు సినిమా అప్డేట్ రావడంతో మహేశ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!







