ఖతార్ ఎయిర్వేస్ పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్..ప్రయాణికులకు హెచ్చరిక..!!
- August 10, 2026
దోహా: ఖతార్ ఎయిర్వేస్ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తూ ప్రజల నుంచి వ్యక్తిగత, ఆర్థిక వివరాలను సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎయిర్‌లైన్ హెచ్చరించింది. సోషల్ మీడియా, డైరెక్ట్ మెసేజ్‌ల ద్వారా పాస్వర్డ్లు, వన్‌టైమ్ పాస్వర్డ్లు (OTPలు), బ్యాంకింగ్ వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని తాము ఎప్పుడూ అడగమని ఖతార్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది.
ఖతార్ ఎయిర్వేస్ పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలు, సోషల్ మీడియా ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖతార్ ఎయిర్వేస్కు సంబంధించిన సేవలు, సమాచారం కోసం ధృవీకరించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలు లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే సంప్రదించాలని కోరింది. నకిలీ ఖాతాల బారిన పడకుండా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







