పర్యాటక రంగంలో సౌదీ అరేబియా దూకుడు.. జీడీపీలో 14.1 శాతం వాటా..!!
- August 10, 2026
రియాద్: మిడిలీస్టు ప్రాంతంలో పర్యాటక రంగంలో సౌదీ అరేబియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రయాణ, పర్యాటక రంగం వాటా 14.1 శాతానికి చేరినట్లు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (WTTC) తాజా నివేదిక వెల్లడించింది. ‘ఎకనామిక్ ఇంపాక్ట్ రీసెర్చ్: గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో.. వచ్చే పదేళ్లలో సౌదీ అరేబియా పర్యాటక రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేసింది. పెరుగుతున్న పెట్టుబడులు, భారీ పర్యాటక ప్రాజెక్టులు, ‘సౌదీ విజన్ 2030’ లక్ష్యాల అమలు ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది.
పర్యాటక మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, పర్యాటక అనుభవాలు, కొత్త గమ్యస్థానాల అభివృద్ధిపై మధ్యప్రాచ్య దేశాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని WTTC తెలిపింది. ఈ విషయంలో సౌదీ అరేబియా ముందంజలో ఉందని పేర్కొంది. 2025లో దేశ ప్రయాణ, పర్యాటక రంగంలో పెట్టుబడులు 19.4 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ‘విజన్ 2030’, పెట్టుబడిదారులకు అనుకూలమైన సంస్కరణలు, భారీ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు దేశంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపింది.
2036 నాటికి 6.3 శాతం వార్షిక వృద్ధి
ప్రస్తుతం ఎదురవుతున్న కొన్ని సవాళ్లు స్వల్పకాలికమేనని, దీర్ఘకాలంలో మధ్యప్రాచ్య పర్యాటక రంగం బలమైన వృద్ధిని నమోదు చేసే అవకాశముందని WTTC అంచనా వేసింది. 2026 నుంచి 2036 మధ్య ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ట్రావెల్, టూరిజం ప్రాంతంగా మిడిలీస్టు నిలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రంగం నుంచి వచ్చే జీడీపీ వార్షికంగా సగటున 6.3 శాతం వృద్ధి చెంది, 2036 నాటికి 605 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.
వచ్చే పదేళ్లలో సౌదీ అరేబియాలో అంతర్జాతీయ పర్యాటకుల వ్యయం రెండింతలకు పైగా పెరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. కొత్త పర్యాటక గమ్యస్థానాలు, మౌలిక సదుపాయాలు, రవాణా నెట్‌వర్క్‌లు, పర్యాటక అనుభవాల అభివృద్ధి ఇందుకు దోహదం చేయనున్నాయి. పర్యాటక రంగం వృద్ధి సౌదీ ఆర్థిక వ్యవస్థను చమురు ఆధారితత నుంచి మరింత వైవిధ్యభరితంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోందని WTTC పేర్కొంది.
భారీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ ఈవెంట్లు, విభిన్న పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి ద్వారా ‘సౌదీ విజన్ 2030’ లక్ష్యాలకు అనుగుణంగా దేశం ముందుకు సాగుతోందని తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడుల కారణంగా స్వల్పకాలిక సవాళ్లను ఎదుర్కొంటూనే పర్యాటక రంగంలో స్థిరమైన వృద్ధిని కొనసాగించే సామర్థ్యం సౌదీ అరేబియాకు పెరుగుతోందని WTTC పేర్కొంది. 2036 వరకు మధ్యప్రాచ్యంలో పర్యాటక వృద్ధికి సౌదీ అరేబియా కీలక ఇంజిన్‌గా నిలిచే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







