నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్‌కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- August 11, 2026
దోహా: నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను సమర్పించి ఖతార్‌లో ఆరోగ్య రంగంలో పనిచేసేందుకు లైసెన్స్ పొందాలని ప్రయత్నించిన 27 మంది పై ఖతార్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను ఉపయోగించినట్లు గుర్తించిన వీరిని దేశంలోని ఆరోగ్య రంగంలో పనిచేయకుండా శాశ్వతంగా నిషేధించినట్లు ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (DHP) డైరెక్టర్ డాక్టర్ సాద్ అల్ కాబీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ప్రొఫెషనల్స్ రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ ప్రక్రియ ప్రారంభ దశల్లోనే వారి విద్యార్హతలు, అనుభవ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ప్రారంభ దశలోనే నకిలీ దరఖాస్తుల గుర్తింపు
లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వివరాలను ముందుగానే సమగ్రంగా తనిఖీ చేయడం ద్వారా నకిలీ దరఖాస్తులను ప్రారంభ దశలోనే గుర్తిస్తున్నట్లు డాక్టర్ సాద్ అల్ కాబీ తెలిపారు.
అంతర్జాతీయ ఆరోగ్య రంగ నిపుణులకు లైసెన్సులు జారీ చేసే విషయంలో అత్యున్నత ప్రమాణాలను కొనసాగించడమే తమ లక్ష్యమని ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అర్హత కలిగిన, నైపుణ్యం ఉన్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి మాత్రమే రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ప్రత్యేక సంస్థలతో కలిసి ధ్రువపత్రాల పరిశీలన
అభ్యర్థులు సమర్పించే విద్యార్హతలు, అనుభవం, ఇతర ధ్రువపత్రాల ప్రామాణికతను నిర్ధారించేందుకు ప్రత్యేక సంస్థల సహకారంతో వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
నకిలీ పత్రాలతో ఆరోగ్య రంగంలో ప్రవేశించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా వైద్య సేవల నాణ్యత, రోగుల భద్రతను కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఖతార్‌లో ఆరోగ్య సేవల వ్యవస్థలో మార్పులు
ఇదిలా ఉండగా, ఖతార్ ఇటీవల ఆరోగ్య సేవల వ్యవస్థను మరింత కేంద్రీకృత విధానంలోకి తీసుకువచ్చింది. ఇక పై వైద్య సేవలు పొందేందుకు నివాసితులు ప్రత్యేకంగా హెల్త్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. వారి హెల్త్ నంబర్‌ను ఖతార్ ఐడీ (QID)తో అనుసంధానించారు.
ఈ నిర్ణయాన్ని ప్రజారోగ్య మంత్రి మన్సూర్ బిన్ ఇబ్రహీం అల్ మహ్మూద్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్‌లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్‌కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







