‘ఓ మై డాగ్' అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా: డైరెక్టర్ శశికిరణ్ తిక్క

- August 11, 2026 , by Maagulf
‘ఓ మై డాగ్\' అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా: డైరెక్టర్ శశికిరణ్ తిక్క

అమిత్ రాయ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, రాజేష్ కుమార్, గీతా అగర్వాల్ శర్మ, పవన్ మల్హోత్రా, శ్రీధర్ దూబే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మై డాగ్’. రాజేష్ భరద్వాజ్, అమిత్ రాయ్, సనా వార్సీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ దర్శకుడు శశికిరణ్ తిక్క ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ..“నేను హైదరాబాద్‌కు ఎన్నోసార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, దిల్ రాజు తో పాటు ఎంతోమందిని కలిశాను. కొన్ని ప్రాజెక్టులు కూడా అనుకున్నాం.కానీ అవి కుదరలేదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచే నాకు పిలుపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే వేదికపై రానా గారిని, వెంకటేష్ గారిని కలిశాను. ఇప్పుడు ఇదే వేదిక నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాను రాయలేదు. నిజానికి ఈ కథను నాతో డాగ్సే రాయించాయి. నాలుగేళ్ల క్రితం ఆస్కార్  నా జీవితంలోకి వచ్చాడు.అప్పటి నుంచి నేను తనను దగ్గరుండి చూసుకునేవాడిని. కానీ ఒక నెల తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది.నేను ఆస్కార్ చూసుకుంటున్నాననుకున్నాను. కానీ నిజానికి ఆస్కార్ నన్ను చూసుకుంటున్నాడు. అక్కడి నుంచే ఈ కథకు స్ఫూర్తి వచ్చింది. మన నిజాయితీని నిరూపించుకోవడానికి మనం ఎంత దూరమైనా వెళ్తాం. అదే విధంగా డాగ్స్ తమ ప్రేమను, నిజాయితీని నిరూపించుకోవడానికి ఎంత దూరం వెళ్తాయి. అదే ఈ కథకు మూలం.డాగ్స్ మనకు సహానుభూతిని, ప్రేమను, కరుణను ఎలా నేర్పిస్తాయనేది ఈ సినిమా ద్వారా చూపించాం.డాగ్స్ చూపించేంత ప్రేమను, కరుణను ఇంకెవరూ చూపించలేరు. అదే ఈ సినిమా చూడటానికి ప్రధాన కారణం.ఈ సినిమాను మీరు తప్పకుండా చూడండి. మీ పిల్లలకు కూడా చూపించండి. ఈ కథ మిమ్మల్ని కదిలిస్తుంది. మీలో ప్రేమను నింపుతుంది. డాగ్స్ లేని తప్పకుండా ఈ సినిమా చూడాలి.తప్పకుండా మీకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.”

దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ.. ఇది ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. అమిత్ రాయ్ గతంలో తీసిన ‘ఓ మై గాడ్ 2’ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ‘ఓ మై డాగ్’ కూడా అందరూ తప్పకుండా చూసి ఆనందించాల్సిన సినిమా. దేశం మొత్తం గర్వించాల్సిన సినిమా ఇది. డాగ్స్ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ఇలాంటి కథలు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ‘చార్లీ’ సినిమా వచ్చింది. అది చాలా బాగా ఆడింది. ఇప్పుడు ‘ఓ మై డాగ్’ కూడా మంచి విజయం సాధిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి కథలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమా ఇది.అందుకే ఈ సినిమా గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది.

రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. అమిత్ రాయ్ ఈ సినిమాను చాలా మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

డాలీషా చౌరాసియా మాట్లాడుతూ..ఇంత మంచి సినిమాను అందించిన దర్శకుడు అమిత్ రాయ్ కి ముందుగా ధన్యవాదాలు. మూగజీవాలకు కూడా మనతో కలిసి ఈ ప్రపంచంలో జీవించే హక్కు ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత డాగ్స్‌పై చాలా మందికి ఉన్న అభిప్రాయం తప్పకుండా మారుతుందని నేను నమ్ముతున్నాను. సినిమాలో మంచి థ్రిల్‌తో పాటు చక్కటి వినోదం కూడా ఉంది' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com