కువైట్‌లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- August 12, 2026
కువైట్ : ప్రవక్త మహ్మద్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 27న అధికారిక సెలవు దినంగా కువైట్ కేబినెట్ ప్రకటించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ బాడీలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు ఇది వర్తించనుంది. 1448 హిజ్రీ సంవత్సరంలో ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ వెల్లడించింది.
ఆగస్టు 27న గురువారం సెలవు కావడంతో పాటు.. ఆ తర్వాత శుక్ర, శని వారాలు సాధారణ వారాంతపు సెలవులు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల వరుస సెలవు లభించనుంది. ఆగస్టు 30, ఆదివారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.
ప్రత్యేక స్వభావం కలిగిన లేదా నిరంతరాయంగా పనిచేయాల్సిన ప్రభుత్వ సంస్థలు, విభాగాలు తమ అవసరాలకు అనుగుణంగా సెలవు ఏర్పాట్లను స్వయంగా నిర్ణయించుకోవచ్చని కేబినెట్ తెలిపింది. అయితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారుల సమన్వయంతో ఈ నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







