సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- August 12, 2026
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు క్రీడా రంగాలను మరింత ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ టూర్‌లో భాగంగా వివిధ అంతర్జాతీయ విదేశీ విశ్వవిద్యాలయాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు, రాబోయే తరాలకు వైట్‌కాలర్ మరియు బ్లూ కాలర్ ఉద్యోగాలకు అవసరమైన అత్యాధునిక నైపుణ్యాలపై విదేశీ ప్రతినిధులతో సీఎం చర్చలు జరపనున్నారు.
తొలుత లండన్ పర్యటన.. ప్రముఖ విద్యాసంస్థల సందర్శన
విదేశీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలుత తొలుత బ్రిటన్ రాజధాని లండన్‌కు వెళ్లనున్నారు. లండన్‌లోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలను సీఎం బృందం ప్రత్యక్షంగా సందర్శించనుంది. అక్కడి విద్యా విధానాలు, నైపుణ్య శిక్షణ కేంద్రాల పనితీరును పరిశీలించి, రాష్ట్రంలో ఆ పద్ధతులను అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.
అమెరికా యూనివర్శిటీల ప్రతినిధులతో భేటీ
లండన్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 23న అమెరికాకు పయనం కానున్నారు. అమెరికాలో పలు ప్రముఖ యూనివర్శిటీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేలా ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా, తెలంగాణ యువతకు గ్లోబల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించేలా ఈ భేటీలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- జెన్‌జీ ఎఫెక్ట్‌తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
- సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- కువైట్‌లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్‌లో ప్రత్యేక శిక్షణ..!!
- ఒమన్‌లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్‌పోర్ట్’ సర్వీస్..!!
- 183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- డీప్‌ఫేక్‌లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!







