సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- August 12, 2026
సలాలా: ఒమన్‌లోని సలాలా ఇట్టీన్ ప్రాంతంలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, ఆహార ఉత్పత్తులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, లాజిస్టిక్స్ సేవలు, ఆర్థిక, పెట్టుబడి రంగాలకు చెందిన సుమారు 100 సంస్థలు, కంపెనీలు, ప్రాజెక్టులు పాల్గొంటున్నాయి.
ధోఫార్ గవర్నర్ హెచ్‌హె సయ్యద్ మార్వాన్ తుర్కీ అల్ సయీద్ ముఖ్య అతిథిగా హాజప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ-ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఆహార భద్రత రంగానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులు, ప్రాజెక్టులు, సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న సంస్థలు, కంపెనీలకు తమ కార్యకలాపాలను పరిచయం చేసుకునేందుకు ఇది వేదికగా నిలుస్తోంది.
ఎయీత లయతనలేయఅదే సమయంలో ఆయా సంస్థల మధ్య సహకారం, పెట్టుబడి అవకాశాలను పెంపొందించేందుకు ఎగ్జిబిషన్ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. వ్యవసాయం, మత్స్య, ఆహార పరిశ్రమలు తదితర రంగాల్లో ఆధునిక సాంకేతికతలు, పెట్టుబడులపై కూడా ఈ ప్రదర్శనలో దృష్టి సారిస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







