కొవ్వొత్తి మంటతో రూమ్‌మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- August 12, 2026
మనామా: మతపరమైన ప్రార్థన సమయంలో వెలిగించిన కొవ్వొత్తిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో తన రూమ్‌మేట్ మృతికి కారణమైన 21 ఏళ్ల ఆసియా మహిళకు హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం ఆమెను శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
2026 మార్చి 20న ఈ ఘటన చోటుచేసుకుంది. కంపెనీకి చెందిన అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్‌లో మతపరమైన ప్రార్థన కోసం మహిళ కొవ్వొత్తిని వెలిగించింది. అనంతరం దానిని చిన్న చెక్క బల్లపై అలాగే మండనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొవ్వొత్తి మంట చెక్క బల్లకు, సమీపంలోని వస్తువులకు అంటుకోవడంతో మంటలు గది మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో గదిలో ఉన్న బాధితురాలు బయటకు రాలేకపోయింది. మంటలు, దట్టమైన పొగ కారణంగా ఇతర మహిళలు ఆమెను రక్షించేందుకు లోపలికి వెళ్లలేకపోయారు.
తాను సాధారణంగా కొవ్వొత్తిని రోజంతా వెలిగించి ఉంచుతానని దర్యాప్తులో తెలిపింది. బల్ల చెక్కతో తయారైందని తెలిసినా కొవ్వొత్తిని ప్లేట్‌పై లేదా ఇతర సురక్షితమైన ప్రదేశంలో ఉంచలేదని అంగీకరించింది. మధ్యాహ్నం సుమారు 2:20 గంటలకు ఫైర్ అలారం మోగడంతో భద్రతా సిబ్బంది, అత్యవసర సేవలకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
నిందితురాలు తనపై నమోదైన ఆరోపణలను అంగీకరించి, రూమ్‌మేట్ మృతికి బాధ్యత వహించింది. దీంతో కోర్టు ఆమెకు ఏడాది జైలు శిక్షతో పాటు శిక్ష అనంతరం శాశ్వత బహిష్కరణను విధించింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







