'సిగ్మా' నుంచి సెకండ్ సింగిల్ ఓలమ్మో వగలాడి రిలీజ్
- August 12, 2026
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న 'సిగ్మా' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ఓలమ్మో వగలాడి సాంగ్ రిలీజ్ చేశారు. తమన్ ఎనర్జిటిక్ నెంబర్ ని కంపోజ్ చేశారు. యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ కల్మంజే కలిసి ఆలపించిన ఈ పాట విన్నవెంటనే కనెక్ట్ అవుతుంది. కృష్ణ చైతన్య సాహిత్యం క్యాచిగా వుంది.
ఈ పాటలో సందీప్ కిషన్, ఫారియా అబ్దుల్లా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరి మధ్య ఉన్న ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. మెలోడీతో పాటు ఎనర్జిటిక్ బీట్‌తో సాగుతున్న ఈ పాట సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది
ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్, హరిహరసుధన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







