డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- August 13, 2026
మనామా: డయబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచేందుకు చేపట్టిన కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా 10 ఇన్సులిన్ పంప్స్ చిన్నారులకు అందజేశారు. ఈ కార్యక్రమం యువ డయబెటిక్ బాధితుల ఆరోగ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ (SCH) చైర్మన్, బహ్రెయిన్ డయాబెటిస్ సొసైటీ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, అలాగే గుడ్ వర్డ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఇసా బిన్ అలీ అల్ ఖలీఫా హాజరయ్యారు.
చిన్నారులకు ఇన్సులిన్ పంపులు అందించడంలో గుడ్ వర్డ్ సొసైటీ, బహ్రెయిన్ డయాబెటిస్ సొసైటీతో కలిసి చేస్తున్న సేవలను డాక్టర్ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్లా ప్రశంసించారు. ఇన్సులిన్ పంపులు చిన్నారులు మధుమేహాన్ని మరింత సమర్థవంతంగా నియంత్రించుకోవడంలో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అలాగే బహ్రెయిన్ న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, వక్ఫ్ మంత్రిత్వ శాఖకు చెందిన జకాత్ అండ్ ఛారిటీ ఫండ్ అందించిన సహకారాన్ని కూడా ఆయన అభినందించారు. ఈ సంస్థ ఇన్సులిన్ పంపులతో పాటు వైద్య పరికరాలు, గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సర్లను కూడా చిన్నారులకు అందించింది. చిన్నారుల ఆరోగ్యానికి సమాజంలోని వివిధ వర్గాలు కలిసి సహకరించడం ద్వారా సామాజిక భాగస్వామ్యం, సేవాభావం, దాతృత్వం వంటి విలువలు మరింత బలపడతాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







