ధోఫార్‌లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- August 13, 2026
తఖా: ధోఫార్ గవర్నరేట్‌లో వారం రోజుల పాటు నిర్వహించనున్న ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒమన్ ఎయిర్ స్పోర్ట్స్ కమిటీ, హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవంలో భాగంగా ఆకాశంలో నిర్వహించిన వివిధ విన్యాసాలు సందర్శకులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్యారాగ్లైడింగ్, గాలిపటాల ఎగరవేత, డ్రోన్ ప్రదర్శనలు వంటి పలు ఎయిర్ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించారు.
ఒమన్ ఎయిర్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ అహ్మద్ అల్ అలావీ మాట్లాడుతూ.. ఎయిర్ స్పోర్ట్స్‌ను సమాజ సంస్కృతిలో ఒక భాగంగా మార్చడంతో పాటు ధోఫార్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ఏడాది ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్‌లో సందర్శకులు, పర్యాటకులు వర్చువల్ రియాలిటీ (VR) సాంకేతికత ద్వారా విమానయాన అనుభూతిని పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రారంభోత్సవం ముగింపు సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ప్రతినిధులను తఖా వాలి షేక్ తారిఖ్ ఖాలిద్ అల్ హినాయ్ సత్కరించారు. ఎయిర్ స్పోర్ట్స్, పర్యాటక రంగాల అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







