ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- August 13, 2026
దోహా: మెత్రాష్ (Metrash) వినియోగదారులకు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఇకపై Metrash యూజర్లు తమ భార్య, పిల్లలు వంటి కుటుంబ సభ్యులను డెలిగేట్ చేసి, వారు తమ సొంత ఫోన్లలో Metrash యాప్‌ను యాక్టివేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కుటుంబ సభ్యుల వద్ద ఖతార్ మొబైల్ నంబర్ లేకపోయినా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ సేవను వినియోగించాలంటే Metrash యాప్‌లోని ప్రధాన మెనూలో ‘Delegation’ ఎంపికను ఎంచుకుని, అనంతరం ‘Relative Registration’ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుడి QID నంబర్, QID గడువు తేదీ, రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించాల్సిన మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేసి ‘Add’ పై క్లిక్ చేయాలి.
వివరాలు నమోదు చేసిన అనంతరం సంబంధిత కుటుంబ సభ్యుడికి అనుమతి లభిస్తుంది. దీంతో వారు పేర్కొన్న మొబైల్ నంబర్‌ను ఉపయోగించి తమ ఫోన్‌లో Metrash యాప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ముఖ్యంగా ఖతార్‌లో స్వంత మొబైల్ నంబర్ లేని కుటుంబ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుందని MoI తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







