భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- August 13, 2026
అబుదాబి: భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు అబుదాబి ప్రభుత్వం ప్రత్యేక ఉచిత వీసా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హత ఉన్న భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు 30 రోజుల యూఏఈ టూరిస్ట్ వీసా ఉచితంగా లభించనుంది. ఈ వీసా విలువ సుమారు Dh285గా ఉంది. అయితే ఈ సదుపాయం పొందాలంటే భారతీయ పర్యాటకులు పాల్గొనే ట్రావెల్ భాగస్వాముల్లో ఒకరి ద్వారా కనీసం మూడు రాత్రుల అబుదాబి హాలిడే ప్యాకేజీని బుక్ చేసుకోవాలి.
11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే
ఈ పైలట్ కార్యక్రమంలో మొత్తం 11 ట్రావెల్ పార్ట్నర్లు పాల్గొంటున్నారు.
1. హాలిడే ట్రైబ్ (Holiday Tribe)
2. థామస్ కుక్ అండ్ ఎస్ఓటీసీ (Thomas Cook & SOTC)
3. థ్రిలోఫిలియా (Thrillophilia)
4. అక్బర్ హాలిడేస్ (Akbar Holidays)
5. ఉటాజో (Utazzo.com)
6. కేసరి టూర్స్ (Kesari Tours)
7. రియా ట్రావెల్స్ (Riya Travels)
8. రాయల్ టూర్స్ (Royal Tours)
9. పిక్యువర్ట్రెయిల్ (PickYourTrail)
10. మేక్మైట్రిప్ (MakeMyTrip)
11. ఆర్యన్ లీజర్ (Aaryan Leisure)
ఈ సంస్థల్లో ఏదైనా ఒకదాని ద్వారా అర్హత కలిగిన అబుదాబి హాలిడే ప్యాకేజీని బుక్ చేసుకున్నప్పుడే ఉచిత వీసా ప్రయోజనం పొందవచ్చు.
ఎప్పుడు ప్రయాణించాలి?
ఈ పథకం కింద ప్రయాణాలు ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉండాలి. అక్టోబర్ 31లోపు ప్యాకేజీ లేదా వీసా బుక్ చేసుకున్నప్పటికీ, ప్రయాణ తేదీ ఆ తర్వాత ఉంటే ఉచిత వీసా వర్తించదు. ప్రారంభ దశలో ఈ పైలట్ కార్యక్రమం ద్వారా 20,000 వరకు వీసాలను అందించనున్నారు.
కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితి ఉందా?
ఒక కుటుంబంలో ఎన్ని మంది అర్హత కలిగి ఉంటే అంతమందికి ఉచిత వీసా పొందే అవకాశం ఉంది. ఒక్క కుటుంబానికి లేదా ఒక్క బుకింగ్‌కు వీసాల సంఖ్యపై ప్రత్యేక పరిమితి లేదు. అయితే ప్రతి ప్రయాణికుడు కనీసం మూడు నైట్స్ అబుదాబిలో స్టే వంటి అర్హతలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
వీసా ఖచ్చితంగా వస్తుందా?
ట్రావెల్ ప్యాకేజీ బుక్ చేసినంత మాత్రాన వీసా ఖచ్చితంగా మంజూరు అవుతుందని చెప్పలేము. ప్రతి వీసా దరఖాస్తు యూఏఈ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, అవసరాలకు లోబడి ఉంటుంది. సంబంధిత ప్రభుత్వ అధికారులు ఆమోదించిన తర్వాతే వీసా జారీ అవుతుంది. వీసా ప్రాసెసింగ్ కూడా సాధారణ యూఏఈ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ప్రకారమే జరుగుతుంది. ఈ పథకానికి ప్రత్యేకంగా వేగవంతమైన ప్రాసెసింగ్ సమయం ప్రకటించలేదు.
అక్టోబర్ తర్వాత కొనసాగుతుందా?
ప్రస్తుతం ఈ పథకం పైలట్ ప్రోగ్రామ్మాత్రమే. అక్టోబర్ 2026లో కార్యక్రమం ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్‌లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







