సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- August 13, 2026
రియాద్: సౌదీ అరేబియాలో వార్షిక ద్రవ్యోల్బణం జూలై లో 1.8 శాతానికి చేరుకుంది. ప్రధానంగా హౌజింగ్, వాటర్, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధన ధరలు 4.2 శాతం పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) తెలిపింది. హౌజింగ్, వాటర్, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధన విభాగంలో వాస్తవ గృహ అద్దెలు 4.3 శాతం పెరిగాయి. దీంతో మొత్తం వార్షిక ద్రవ్యోల్బణంలో ఈ విభాగం అత్యధికంగా 0.8 శాతం పాయింట్ల మేరకు వాటా కల్పించింది.
వ్యక్తిగత సంరక్షణ, సామాజిక రక్షణ, ఇతర వస్తువులు-సేవల ధరలు ఏడాది ప్రాతిపదికన 2.9 శాతం పెరిగాయి. ఇందులో ఇతర వ్యక్తిగత వస్తువుల ధరలు 11.1 శాతం పెరగడం ప్రధాన కారణంగా ఉంది. నగలు, గడియారాల ధరలు 12 శాతం పెరిగాయి. వినోదం, క్రీడలు, సాంస్కృతిక విభాగంలో ధరలు 2.4 శాతం పెరిగాయి. సెలవు ప్యాకేజీల ధరలు 3.7 శాతం పెరగడం ఇందుకు కారణమైంది. ఆహారం, పానీయాల ధరలు 1.5 శాతం, రవాణా ధరలు 1.4 శాతం పెరిగాయి.
అయితే, ఫర్నిచర్, గృహోపకరణాలు, సాధారణ గృహ నిర్వహణకు సంబంధించిన ధరలు వార్షిక ప్రాతిపదికన 0.5 శాతం తగ్గాయి. దుస్తులు, ఫుట్ వేర్ ధరలు 0.4 శాతం తగ్గినట్లు GASTAT వెల్లడించింది. జూన్‌తో పోలిస్తే జూలైలో వినియోగదారుల ధరల సూచీ (CPI) 0.2 శాతం పెరిగింది.
హౌజింగ్, వాటర్, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధన ధరలు నెలవారీగా 0.9 శాతం పెరిగాయి. ఇందులో విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాల ధరలు 7.1 శాతం పెరగడం కీలకంగా మారింది. ఇక రెస్టారెంట్లు, వసతి సేవల ధరలు 0.5 శాతం, వినోదం, క్రీడలు, సంస్కృతి ధరలు 0.4 శాతం, రవాణా ధరలు 0.2 శాతం పెరిగాయి.
అదే సమయంలో వ్యక్తిగత సంరక్షణ, సామాజిక రక్షణ, ఇతర వస్తువులు-సేవల ధరలు జూన్‌తో పోలిస్తే 1 శాతం తగ్గగా, ఫర్నిచర్, గృహోపకరణాలు, సాధారణ గృహ నిర్వహణ వ్యయాలు 0.1 శాతం తగ్గినట్లు GASTAT గణాంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







