ఖతార్‌లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- August 13, 2026
దోహా: ఖతార్‌లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో వేసవి పనివేళలకు సంబంధించిన నిబంధనలను యజమానులు, కార్మికులు తప్పనిసరిగా పాటించాలని కార్మిక మంత్రిత్వ శాఖ సూచించింది. అధిక ఉష్ణోగ్రతలకు నేరుగా గురికాకుండా ఉండేందుకు కార్మికులు వృత్తిపరమైన భద్రతా చర్యలు పాటించాలని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలెత్తే అనారోగ్యాలు, హీట్‌స్ట్రోక్ వంటి సమస్యలను నివారించేందుకు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
నిబంధనల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో పనులు ఉదయం 10 గంటలలోపు పూర్తి చేయాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నేరుగా ఎండలో పనిచేయడం నిషేధం. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పనులను ప్రారంభించవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో నిషేధిత పనివేళలను పాటించడం కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత కీలకమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
బహిరంగ ప్రదేశాల్లో పనికి సంబంధించిన ఈ నిబంధనలు జూన్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి సెప్టెంబర్ 15 వరకు అమల్లో ఉంటాయి. వేసవి కాలంలో కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు యజమానులు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ మరోసారి గుర్తుచేసింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







