షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- August 13, 2026
దుబాయ్: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) షేక్ జాయెద్ రోడ్డును విస్తరించింది. సుమారు 2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టింది.
ఈ విస్తరణలో భాగంగా అబుదాబి వైపు నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇంటర్‌చేంజ్ వైపు వెళ్లే మార్గంలో అదనంగా ఒక లేన్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బుర్జ్ ఖలీఫా/దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ కొత్త లేన్ అందుబాటులోకి వచ్చింది.
దుబాయ్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో షేక్ జాయెద్ రోడ్ ఒకటి. నగర జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు RTA పలు రహదారి అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తోంది.
ప్రధాన మార్గాల్లో వాహనాల రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని కుదించడం, రహదారి సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, లతీఫా బింట్ హమ్దాన్ స్ట్రీట్‌పై ఇటీవల కొత్త లేన్‌తో పాటు రెండు యూ-టర్న్‌లను ప్రారంభించారు. ఈ మార్పులతో అక్కడ ట్రాఫిక్ రద్దీ 30 శాతం వరకు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
షేక్ జాయెద్ రోడ్డుపై చేపట్టిన తాజా విస్తరణతో దుబాయ్‌లోని కీలక ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సాఫీగా సాగుతాయని RTA భావిస్తోంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







