గుడ్‌న్యూస్.. ఖతార్ నుంచి భారత్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ ప్రారంభం..!!

- August 16, 2026 , by Maagulf
గుడ్‌న్యూస్.. ఖతార్ నుంచి భారత్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ ప్రారంభం..!!

దోహా: ఖతార్‌లో నివసిస్తున్న భారతీయులకు ఖతార్ పోస్ట్‌ శుభవార్త అందించింది. ఇండియా పోస్ట్‌, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) సహకారంతో ఖతార్ నుంచి భారత్‌కు డబ్బులు పంపించే కొత్త రెమిటెన్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సేవ ద్వారా ఖతార్‌లోని కస్టమర్లు  పోస్ట్ ట్రాన్స్ ఫర్ సర్వీస్‌ను ఉపయోగించి భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు లేదా ఇతర లబ్ధిదారులకు డబ్బు పంపించవచ్చు. ఈ సేవ యూపీఐ (ified Payments Interface) సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. దీంతో ఖతార్‌లో ఉన్న భారతీయులకు భారత్‌లోని కుటుంబ సభ్యులకు డబ్బు పంపేందుకు మరో సులభమైన, నమ్మకమైన మార్గం అందుబాటులోకి వచ్చింది.

భారత ప్రవాసులకు మరింత సౌకర్యం

ఖతార్‌లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులకు ఈ కొత్త సేవ ప్రయోజనం కలిగించనుంది. కుటుంబ అవసరాల కోసం భారత్‌కు డబ్బు పంపే ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు.. పోస్టల్ సేవలను ఆధునిక డిజిటల్ చెల్లింపు విధానాలతో అనుసంధానం చేయడంలో ఇది కీలక అడుగుగా నిలుస్తుందని ఖతార్ పోస్ట్ తెలిపింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సేవలను విస్తరించడం, పోస్టల్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా సేవలను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని పేర్కొంది.

ఇండియా పోస్ట్‌, యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌తో కలిసి ఈ సేవను ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాల ప్రాధాన్యత మరింత స్పష్టమవుతుందని ఖతార్ పోస్ట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోస్టల్ నెట్‌వర్క్‌లు, నిపుణుల సహకారాన్ని ఉపయోగించుకుని కస్టమర్లకు వేగవంతమైన, ఆచరణాత్మకమైన, నమ్మకమైన ఆర్థిక సేవలను అందించడమే లక్ష్యమని పేర్కొంది.
ఈ కొత్త మనీ ట్రాన్స్‌ఫర్ సేవ ఖతార్‌లోని భారతీయ ప్రవాసులకు ప్రయోజనం కల్పించడంతో పాటు భారత్–ఖతార్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com